ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : పవిత్రమైన రంజాన్ మాసం సోదర భావం, అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కాటారం మండలంలోని ఎల్జి గార్డెన్లో కాటారం ముస్లిం కుల పెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీ సోదరీమణులను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు.మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ముస్లిం సోదరుల అభ్యున్నతికి విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను సీ.ఎం.రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రంజాన్ పండుగ సౌభ్రా తృత్వాన్ని పెంపొందించే గొప్ప పండుగ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలు, వర్గాలు కలిసి జీవించే సంస్కృతికి నిలయమని అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పడాల అశోక్ కుమార్. తహసిల్దార్ నాగరాజు. ఎం.పీ.డీ.వో.ఏ.బాబు. కాటారం డి.ఎస్.పి. ప్రజా ప్రతి నిధులు. పలువురు అధికారులు. ముస్లిం కులస్తులు మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్ తో పాటు కుల పెద్దలు పాల్గొన్నారు.
Admin
E Nivas News