Wednesday, 29 July 2026 12:02:23 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి

ఎస్పీ డాక్టర్ వినీత్

Date : 03 February 2026 12:55 AM Views : 120

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆర్థిక నేరాలపై సాంకేతికతను వినియోగించి త్వరిత గతిన చేదించాలని, నేరాల నియంత్రణపై దృష్టి పెట్టి,ఎన్నికల నిబంధనలుతప్పకుండా అమలు చేసి,సమస్యత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించాలి ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు.సోమవారం నారాయణపేట జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా పోలీస్కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్లో నెలవారి నేర సమీక్ష సమావేశాన్నిఎస్పీ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులు, దర్యాప్తులో నాణ్యత, నేరాల నియంత్రణ అంశాల పై ఎస్పీ సమీక్షించారు. అలాగే ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలనిసూచించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా,శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనిఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్యాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండేలా దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం అదెలా చూడాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జనసామర్థ్యం గల ప్రదేశాలలో విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని తెలిపారు. జిల్లా లో అక్రమ గంజాయి రవాణా,మట్కా ,జూదం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, పబ్లిక్ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి దొంగిలించిన సొత్తును బాధితులకు అందించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలలో తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, సున్నితమైన గ్రామాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ వెంటనే అమలు చేయాలని, రౌడీ షీటర్స్‌, పాత నేరస్తులు, అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేసి, వెపన్స్ డిపాజిట్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు ఉండాలని, మహిళలు, వృద్ధులు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉంటూ నిరంతరం తనిఖీలు నిర్వహించి నగదు, మద్యం, ఇతర ప్రలోభకర వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలనితెలిపారు. ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని, కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అన్ని పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా మున్సిపాలిటీల పరిధిలో, మరికల్ కేంద్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ముందస్తు గత మూడు సంవత్సరాల నుండి ఎక్కువగా జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ మరియు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ను గుర్తించి అక్కడ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలను రోడ్డు భద్రతా మీటింగులో చర్చించి సంబంధిత అధికారులతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారకు సూచికలను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హూల్ హాక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివ శంకర్, రామ్ లాల్, సైదులు, భగవత్ రెడ్డి ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేష్, సునీత, రాజు, రాముడు, బాలరాజు, రాజశేఖర్, రాములు, భాగ్యలక్ష్మి రెడ్డి, నవీద్, అశోక్ బాబు, పురుషోత్తం, గాయత్రి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :