Friday, 11 September 2026 10:26:42 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం...

Date : 03 September 2026 08:15 PM Views : 80

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జపాన్‌లో పర్యటించి గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు వొడ్నాల శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకుని మంత్రి వివేక్ వెంకటస్వామి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించడంతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు వారిని సిద్ధం చేయాలనే లక్ష్యంతో మంత్రి వివేక్ వెంకటస్వామి చేపట్టిన జపాన్ పర్యటన ఎంతో ప్రాధాన్యత కలిగినదని అన్నారు.జపాన్‌లో అమలవుతున్న ఆధునిక సాంకేతిక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి విధానాలు, పరిశ్రమలకు అనుగుణంగా యువతకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను అధ్యయనం చేయడం ద్వారా వాటిని తెలంగాణలోనూ అనుసంధానం చేసే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తెలంగాణ యువతలో ప్రతిభ, సామర్థ్యానికి కొదవ లేదని, వారికి సరైన నైపుణ్యం, శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, అవకాశాలు అందిస్తే ప్రపంచ స్థాయిలో పోటీ పడి రాణించగలరని అన్నారు. యువతను కేవలం స్థానిక ఉపాధి అవకాశాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని నైపుణ్యాభివృద్ధి విధానాలను అధ్యయనం చేసి తెలంగాణ యువతకు అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలోని యువతకు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి, అంతర్జాతీయ అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, మాజీ జెడ్పిటిసి యాకూబ్ అలీ, మాజీ కౌన్సిలర్ పనాస రాజు, జిల్లా కార్యదర్శి గోపతి బానేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి గోపు రాజం, బత్తుల వేణు, నాయకులు బొడ్డుల ప్రేమ్ సాగర్, నక్క శ్రీనివాస్, కుమ్మరి సాయితేజ, కుర్మ సురేందర్, అందుగుల మల్లేష్, కనకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :