Sunday, 13 September 2026 01:12:32 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి...

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 18 March 2026 07:24 AM Views : 340

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ తో కలిసి సందర్శించి వార్డులు, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వెంకట్రావుపేట, దౌడపల్లి, చందారం గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా పట్టాలని, ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకుతరలించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. గృహాలు, వ్యాపార సముదాయాల వద్ద చెత్తను రోడ్లపై, మురుగు కాలువలలో వేయకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకుసూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. లక్షట్టిపేట మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ పథకం నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రానున్న వేసవిలో ప్రజలకు నిరంతరంగా నీటిని అందించే విధంగా కార్యచరణ రూపొందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :