Tuesday, 15 September 2026 02:29:12 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం...

Date : 15 July 2026 11:26 PM Views : 83

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూభారత్ ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని అనుకుంటుందన్నారు. అభివృద్ధిలో భాగంగానే అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఫ్యూచర్ సిటీకివచ్చేపెట్టుబడులకు, పరిశ్రమలకు ఇది మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే అత్యంత అధునాతన నగరంగా నిర్మించాలని అనుకున్నట్టు చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఫార్చూన్ 500లోని కంపెనీలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. గతేడాది గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి 108 దేశాలనుండిపరిశ్రమలను ఆహ్వానించినట్టు చెప్పారు. తన టీంలోని మంత్రులు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. 2034 వరకు 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించడమే తన లక్ష్యం అని తెలిపారు. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2047 వరకుభారతప్రభుత్వం 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని అందులో 10శాతం జీడిపీ తెలంగాణ నుండి ఉండాలన్నారు. అది సాధించాలంటే పెట్టుబడులు కావాలని, వసతులు కావాలని నిరుద్యోగం పోవాలన్నారు. అందుకోసమే తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ పాలసీని తీసుకువచ్చిందన్నారు తెలంగాణ రైజింగ్ పాలసీలో ప్రముఖ విద్యావేత్తలను, వ్యాపారవేత్తలను చేర్చామని చెప్పారు. పరిశ్రమలకు సింగిల్ విండోలోనే అన్ని అనుమతులు ఇస్తామన్నారు. రాబోయే 14ఏళ్లలో 7మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని అమెజాన్ భావిస్తోందని కానీ తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు అది సరిపోదన్నారు. 2034 వరకు ఫ్యూచర్ సిటీలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకోసం మీకు ఎలాంటి సహాకారం కావాలన్నా అందిస్తామని అన్నారు. మంత్రులు, అధికారులను సంప్రదించి మీకు ఏం కావాలన్నా అడగొచ్చని చెప్పారు. తాను దీనిపై తరచూ రివ్యూ నిర్వహిస్తానని అన్నారు. ఒక పాలసీ లేకపోతే రాష్ట్రం అభివృద్ధి జరగదని అన్నారు. అందుకే తెలంగాణను అభివృద్ధి చేసేందుకే పాలసీలను రూపొందించామన్నారు. రాష్ట్రానికి అన్వెస్ట్ మెంట్ పాలసీ, మెడికల్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీలు ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగాన్ని పోగొట్టేందుకు స్కిల్ యూనివర్సిటీని తీసుకువచ్చామన్నారు. 2047 నాటికి భారత్ వంద సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతుందని ఆ నాటికి దేశ జీడీపీలో తెలంగాణ జీడీపీ 10 శాతం ఉండేలా పనిచేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే అధికారులు, మంత్రులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీ అభివృద్దికి మైలురాయిగా మారుతుందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు ఇది సాధ్యం కాదని చాలా మందిఅన్నారని కానీ ఇప్పుడు ఎంతో అభివృద్ధిచెందుతోందని చెప్పారు. ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. కానీ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలంటే ప్రజలకు సౌకర్యాలుకల్పించాలంటే నగరంలోని పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో మెట్రో విస్తరణ జరగాలని, ఇంధనంతో నడిచే ఆర్టీసీ బస్సులను నగరం వెలుపలకు తరలించి ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నగరంలో ఎవరు ఈవీ వాహనాలు కొన్నా జీరో ట్యాక్స్ విధించేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అదే విధంగా మూసీని ప్రక్షాళన చేసి కాలుష్యం లేకుండా చేస్తామని తెలిపారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, పరిశ్రమల తరలింపును కోర్ అర్బన్ రీజియన్‌గా పేరు పెట్టుకున్నామని అన్నారు. కోర్ అంటే క్యూర్ అని.. 2073 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కాలుష్యం నుండి క్యూర్ చేయడమే తమ లక్ష్యం అని చెప్పారు. క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ గా రీడిజైన్ చేస్తామని అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు బయటవైపు, రీజినల్ రింగ్ రోడ్డకు ఇవతల వైపు 10కిమీలు మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్గానిర్ణయించామన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా నష్ట పరిహారం అందిచాలని అధికారులకు సూచిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: