ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : గోదావరి నది తీరంలో మనిషి జన్మించడంతోపాటు జీవించడం పూర్వజన్మ సుకృతం అని వేద పండితులు భరద్వాజ శర్మ అన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సాయంత్రం గోదావరి వద్ద గంగాహారతిని ఘనంగా జరిపారు. అనంతరం భరద్వాజ శర్మ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గోదావరి తీరంలో మన జీవనం కొనసాగడం పూర్వజన్మ అదృష్టమని ఈ అవకాశాన్ని కల్పించిన మహాదేవుడికి కృతజ్ఞతగా ఇట్టి గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు. పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరుకాగా పేద పండితుల వేదమంత్రాల మధ్య అంగరంగ వైభవంగా గంగాహారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు హనుమాన్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరంఈ కార్యక్రమానికి ప్రసాద వితరణ అవోపా లక్షెట్టిపేట వారు అందించారు.
Admin
E Nivas News