ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో వీడియో కాన్‌ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారంఒక విచిత్రమైన ప్రతిపాదన చేశారు. తమ ప్రభుత్వం ఏఐ కంపెనీల మీద ప్రత్యేక పన్ను వేసి, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తాం అని నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో పాల్గొంటూ అన్నారు. దీంతో ఆ సదస్సులో పాల్గొంటున్న వివిధ ఏఐ నిపుణులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడిందట. అసలు ఏఐ కంపెనీలకు వివిధ రాయితీలు ఇచ్చి ప్రపంచ దేశాలు అన్నీ ఆహ్వానిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన చాలామందిని అయోమయపరచింది. ఎందుకంటే అసలు ఐటీ కంపెనీల మీద, అది కూడా బహుళజాతి ఐటీ కంపెనీల మీద ఒక రాష్ట్రం పన్ను వేయడం సాధ్యమా? ఒకవేళ నిజంగానే అలాంటి పన్ను వేస్తే ఆ కంపెనీలు తెలంగాణకు ఎందుకు వస్తాయి అనే ప్రశ్నలు ఐటీరంగ నిపుణులు వేస్తున్నారు. అసలే పెట్టుబడులు రాక రాష్ట్రం సతమతం అవుతున్న ఈ సమయంలో ఇలాంటి అసందర్భపు ప్రకటనలతో రావాలనుకునే కంపెనీలు కూడా పునరాలోచించుకునేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.తన అజ్ఞానంతో ఇప్పటికే రాష్ట్ర ప్రజల ముందు పరువు పోగొట్టుకుంటున్న రేవంత్, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ సదస్సుల్లో కూడా రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నాడు అని మీడియావర్గాల్లో టాక్. ఇక ఆయన ప్రసంగాల వీడియోలు బయటికి వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటం వల్ల ఈ మధ్య ఇటువంటి వీడియోలు బయటికి రాకుండా ఆయన పీఆర్ టీం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
Admin
E Nivas News