Thursday, 15 January 2026 05:41:18 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

ఏఐఎఫ్టిపి దక్షిణ భారత విభాగం నిర్వాహణ కమిటీ సంయుక్త కార్యదర్శి గా నగేష్ రంగి

Date : 13 January 2026 09:34 PM Views : 20

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హైదరాబాద్ లో ప్రముఖ టాక్స్ అడ్వకేట్ నగేష్ రంగి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టిషనర్స్ (ఏఐఎఫ్టిపి) దక్షిణ భారత విభాగం నిర్వాహణ కమిటీలో సంయుక్త కార్యదర్శిగా 2026 గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఈ పదవికి మంథని చెందిన న్యాయవాది జాతీయ స్థాయిలో ఎంపిక కావడం విశేషం. దేశవ్యాప్తంగా వేలాది టాక్స్ ప్రాక్టిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఐ ఎఫ్ టి పి వంటి ప్రతిష్టాత్మక జాతీయ సంఘంలో దక్షిణ భారత విభాగంలో సంయుక్త కార్యదర్శి గా పదవి పొందటం ఆనందంగా ఉందని రంగి నగేష్ తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా వృత్తి పరమైన నైపుణ్యం, సంస్థాగత అనుభవం, నాయకత్వ ప్రతిభకు జాతీయ స్థాయిలో సంపూర్ణ గుర్తింపు లభించినట్లు భావిస్తున్నారు.

గతంలో నగేశ్ రంగి తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వరుసగా రెండు పర్యాయములు బాధ్యతలు చేపట్టి, సంఘాన్ని సుస్థిరమైన మార్గంలో ముందుకు నడిపించారు. 2025లో సదరన్ జోన్ తెలంగాణ సమన్వయకర్త గా బాధ్యతలు నిర్వర్తించారు. వీరు సంఘ సభ్యుల సంక్షేమం, వృత్తి పరమైన సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో నిరంతర కృషి చేస్తున్నారు. సంఘ అభివృద్ధికి విశేష సేవలు అందించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల టాక్స్ ప్రాక్టిషనర్ల సమస్యలను ఉన్నత వేదికలపై ప్రస్తావించారు. జీఎస్‌టి అమలు, చట్టపరమైన మార్పులు, ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న సవాళ్లపై అనేక అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

వృత్తి పట్ల అపారమైన అంకితభావం, నాయకత్వ సామర్థ్యం, క్రమశిక్షణతో కూడిన నిరంతర సేవలను పరిగణనలోకి తీసుకున్న ఏఐఎఫ్టిపి జాతీయ నాయకత్వం రంగి నగేష్ తో పాటు తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా వాసి ఉల్లిబోయిన సైదులు 2026–27 కాలానికి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆప్టెడ్ సభ్యలు గా వసంత కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ ఎన్నిక ద్వారా తెలంగాణ నుండి, జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం లభించిందని వృత్తి వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సదరన్ జోన్ లో వీరితో పాటు తెలంగాణ నుండి టి వి సుబ్బారావు సమన్వయకర్తగా, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా హైదరాబాద్ నుండి విఠల్ రామరాజు, కాట్రగడ్డ నరేంద్రబాబు, కె.నర్సింగ రావు, రమణమూర్తి, బాలకృష్ణ, సమ్మయ్య, దుర్గాప్రసాద్ రావు ఖమ్మం, మల్లికార్జున్ దేవ్ కరీంనగర్, వెంకటరమణ, నల్గొండ తదితరులు ఎన్నికైన్నారు. ఈ నియామకం యువ టాక్స్ ప్రాక్టిషనర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర టాక్స్ ప్రాక్టీషనర్ల సమస్యలను జాతీయ వేదికపై మరింత బలంగా ప్రస్తావించేందుకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నియామకంతో కష్టపడి పనిచేస్తే జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధ్యమేనన్న నమ్మకాన్ని బలపరుస్తోందని తెలియజేసారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :