Tuesday, 28 July 2026 11:37:44 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ

లక్షెట్టిపేట గురుకులంలో దరఖాస్తుల స్వీకరణ

Date : 16 October 2025 08:21 PM Views : 335

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థినీ, విద్యార్థులు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 17 వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా లక్షెట్టిపేట (బాలికల) గురుకుల విద్యాలయంలో దరఖాస్తులు సమమర్పించాలని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు హాల్ టికెట్, ర్యాంకు ధ్రువీకరణ పత్రాల నకలు ప్రతులు జత పరచాలని సూచించారు. లక్షెట్టిపేట, చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి (బాలికలు), బెల్లంపల్లి, కాసిపేట, కోటపల్లి, మంచిర్యాల, జైపూర్ (బాలుర) సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 18న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేసి, భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. బాలికల గురుకులాలలోని 6వ తరగతిలో ఎస్ సి 6, ఎస్టి 2, బీసీ 3, జనరల్ 3, మైనారిటీ 2 సీట్లు ఉన్నాయని, 7వ తరగతిలో బీ సి 5 సీట్లు, 8 వ తరగతిలో ఎస్ సి 4, ఎస్టి 1, బీసీ 10, జనరల్ 6, మైనారిటీ 5, 9వ తరగతి లో ఎస్ సి 3, ఎస్టి 4, బీసీ 4, జనరల్ 5, మైనారిటీ 3 సీట్లు ఉన్నాయని తెలిపారు. బాలుర గురుకులాలలో 5వ తరగతిలో, ఎస్టి 3, జనరల్ 3, మైనారిటీ 2 సీట్లు, 6వ తరగతిలో ఎస్ సి 9, ఎస్టి 5, జనరల్ 1, మైనారిటీ 6 సీట్లు, 7వ తరగతిలో ఎస్ సి 5 సీట్లు, 8వ తరగతిలో ఎస్ సి 8, బీసీ 8, జనరల్ 6, మైనారిటీ 8, 9వ తరగతి లో ఎస్ సి 11, బీసీ 4, ఓసీ 7, మైనారిటీ 5 సీట్లు ఉన్నాయని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :