ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : బైక్ ప్రమాదంలో గాయపడిన 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు సయ్యద్ సర్వర్ భాయ్‌ను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ పరామర్శించారు. సర్వర్ భాయ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని, అవసరమైన వైద్య సహాయం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగేందర్ రెడ్డి, జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద బోయిన ఐలమల్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష్, మెంచు అశోక్, గుండగాని వెంకన్న, రవి నాయక్, శ్రీనివాస్ నాయక్, నరసింహ రెడ్డి, వాజీద్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లి అక్కడి మహిళలతో సమావేశమయ్యారు. కాలనీలో ఉన్న సమస్యలను మహిళలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్తు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మహిళల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.
Admin
E Nivas News