ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మాజీ అఖిలభారత సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతిని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం మండల కార్యదర్శి డి.స్వామన్న, నాయకులు టి.వెంకటేశ్వరరావు, ఎస్.బాలయ్య, తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చెందిన వాడుగా ఉంటూ ఎస్ఎఫ్ఐ ఉద్యమాలలో చురుకుగా పాల్గొని రాజకీయాలలో వచ్చి అంచలంచలుగా ఎదుగుతూ ఆల్ ఇండియా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా రావడం జరిగిందన్నారు అంతే కాకుండా రాజ్యసభ సభ్యులుగా మూడు దఫాలుగా పనిచేయడం జరిగిందన్నారు. బహుభాషా కోవిదులుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. రాజ్యసభలో రైతులు కార్మికులు బడుగు బలహీన వర్గాల గురించి సమస్యలను లేవనెత్తడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాల యేసు, ఎం సి.నారాయణ, సోడా భాష, బేతి పుల్లయ్య, జయరాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News