ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ 10వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన బాదావత్ బేబీశ్రీ రవి నాయక్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని 10 వ వార్డు ప్రజలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా 10 వ వార్డు కౌన్సిలర్ బాదావత్ బేబీశ్రీ రవి నాయక్ మాట్లాడుతూ.. 10 వ వార్డ్ ప్రజలకు రుణపడి ఉంటానని మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మా మీద నమ్మకంతో మా గెలుపుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 10వ వార్డు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వారన్నారు, ఈ కార్యక్రమంలో గోల్కొండ వెంకన్న, ఐనాల పరశురాములు, భాషిపంగు వీరబాబు, ఉప్పలయ్య, కృష్ణ తదితరులు ఉన్నారు
Admin
E Nivas News