ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం నెరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్ వాడి టీచర్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు 18 వేలు వేతనం అందిస్తామని హామీ ఇచ్చారని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సైతం అందట్లేదని, తమకు కళ్యాణ లక్ష్మీ సైతం రాదని అంగన్ వాడి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూహామీలకే పరిమితమైన కాంగ్రెస్ అమలుచేయడంలో లేదని, కచ్చితంగా అంగన్ వాడి టీచర్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని, అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. తక్షణమే సంబంధిత అధికారితో మాట్లాడి ప్రభుత్వానికి మరియు తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Admin
E Nivas News