Monday, 14 September 2026 09:00:45 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రియల్ టైం డేటా ఎంట్రి చేపట్టాలి...

మంథని సహకార సంఘం అఫిషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్

Date : 28 April 2026 05:45 AM Views : 173

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రియల్ టైం డేటా ఎంట్రి చేపట్టాలని మంథని సహకార సంఘం అఫిషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్ ట్యాబ్ ఆపరేటర్లకు సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని కార్యాలయంలో సెంటర్ ఇంచార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లకు అవహగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని సహకార సంఘం అఫిషియల్ పర్సన్ ఇంచార్జి కె.అనిల్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే అప్పటికప్పుడు ట్యాబ్ లో డేటా ఎంట్రి చేయాలని, ఖచ్చితంగా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. అలాగే జీపిఎస్ ఉన్న వాహనాల ద్వారా మాత్రమే రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలని అన్నారు. వరి ధాన్యం లోడ్ చేసే సమయానికి మీకు ఏ మిల్లు కేటాయించారో ముందే తెలియదని, ఇకపై మాన్యువల్ మిల్లు అలాట్ మెంట్ ఉండదని అన్నారు. ఆన్ లైన్ లో ట్రక్ చిట్ జనరేట్ చేసిన తర్వాత మాత్రమే ఆటోమేటిక్ గా రైస్ మిల్లు పేరు చూపిస్తుందని, ట్రక్ చిట్ లో ఏ మిల్లు పేరు చూపిస్తుందో ఆ మిల్లు కు మాత్రమే ధాన్యాన్ని పంపించాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో సెంటర్ ఇంచార్జీలు తప్పనిసరిగా రికార్డు ల్లో ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, ట్రాన్స్పోర్ట్ చేసిన ధాన్యం వివరాలు విధిగా నమోదు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ప్యాడి క్లీనర్లతో ధాన్యాన్ని శుభ్రపర్చాలని, 17 శాతం తేమ కలిగిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులు సెంటర్ కు ధాన్యం తీసుకువచ్చే సమయంలోనే వారి నుంచి అదార్ కార్డు జీరాక్స్, పట్టా పాస్ పుస్తకం జీరాక్స్, బ్యాంకు పాసు పుస్తకం జీరాక్స్, ఓటిపి వచ్చే సెల్ నంబర్ ను సేకరించాలని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగగుండా తగు జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది, సెంటర్ ఇంచార్జీలు, ట్యాబ్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :