Tuesday, 15 September 2026 06:22:32 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

Date : 01 December 2025 08:18 PM Views : 267

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం,అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమిoచిoదని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 01-12-2025 నుండి 01-01-2026 వరకు* కొనసాగుతాయని తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందన్నారు. (భారతియ న్యాయ సంహిత) 223, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. డీజే ,డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు... రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో డీజే సౌండ్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడగించమని అని సిపితెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించారు. వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే సౌండ్ల్ వినియోగిస్తున్నారని అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి ల అనుమతి పొందాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్ లో వినియోగించాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు 01-12-2025 నుండి 01-01-2026 వరకు* కొనసాగుతాయని తెలిపారు పరిస్థితుల ప్రభావం ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని అన్నారు. (భారతియ న్యాయ సంహిత) 223, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు... రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల పరిధిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం తేది 01-12-2025 ఉదయం 6:00 నుండి 01-01-2026 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించ కూడదన్నారు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మరియు శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సిపి సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: