Thursday, 30 July 2026 12:34:24 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లాకు, జోగులాంబ జోన్‌కు మంచిపేరు తేవాలి...

ఎస్పీ డి.జానకి

Date : 14 February 2026 09:17 PM Views : 167

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్‌లో పాల్గొనబోయే మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు మహబూబ్‌నగర్ జిల్లాకు మరియు జోగులాంబ జోన్‌కు మంచిపేరు తేవాలని జిల్లాఎస్పీడి.జానకి సూచించారు. ఫిబ్రవరి 17నుండి హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్‌కు ఎంపికైన క్రీడాకారులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాకుండా పోలీస్ శాఖలోని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం సహనశక్తి మరియు నాయకత్వ లక్షణాలను ప్రతిబింబించే వేదిక అని తెలిపారు. ఈసందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా ఎస్పీస్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు స్పోర్ట్స్ షూస్ అందజేశారు. క్రీడాకారులు సరైన సాధనతో, పూర్తి నిబద్ధతతో పోటీల్లో పాల్గొని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి వేదికపై పాల్గొనే ప్రతి క్రీడాకారుడు తన వ్యక్తిగత ప్రతిభతో పాటు జిల్లా మరియు జోన్ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తాడని స్పష్టంచేశారు. గెలుపు లక్ష్యంగాకఠిన సాధన చేయాలని, నిరంతర శిక్షణ, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం విజయానికి మూలాధారాలని పేర్కొన్నారు. మైదానంలో చూపే ప్రతీ ప్రదర్శన పోలీస్ శాఖ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంటూ క్రీడా స్ఫూర్తితో సంపూర్ణ నిబద్ధతతో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాకు మరియు జోన్‌కు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్. అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్ఐలు అడ్మిన్ కృష్ణయ్య, నగేశ్, ఆర్ఎస్ఐ సత్యం క్రీడాకారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: