ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ముసాయిదా ఓటరు జాబితాపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం మంథని పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ మనోహర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలో ఉన్న అభ్యంతరాలు, ఆక్షేపణలపై చర్చించి లిఖిత పూర్వక దరఖాస్తులను స్వీకరించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కమీషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, సబ్బని సంతోష్, అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News