Monday, 14 September 2026 09:02:57 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

వసతి గృహ విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్

Date : 03 February 2026 10:48 PM Views : 185

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ - ఉట్నూర్ అధికారి యువరాజ్ మార్మాట్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలు (బాలికలు), లక్షెట్టిపేట, జన్నారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు( బాలూరు) లను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం, ఇతర సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలలోవసతి గృహాలలో నెలకొన్న సమస్యలు, మెనూ ప్రకారం భోజనం పంపిణీ, ఆహారం రుచి, మెనూ అమలు వివరాలు తెలుసుకొని, తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు వండిన ఆహారం రుచిని తెలుసుకొని, కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించి, ఆరోగ్య కార్యకర్తలతో లతో ఐ.టి.డి.ఎ. పల్స్ యాప్ పని తీరుపై ఆరా తీశారు. పల్స్ యాప్ పై ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలుగల ఆహారాన్ని అందించాలని ప్రిన్సిపల్, సంక్షేమ అధికారి, కామాటీ, వంట పని వారు, పారిశుద్ధ్య, మల్టీపర్పస్ వర్కర్లకు సూచించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా వసతి గృహ పరిసరాలలో నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి రోజు వంటగది, స్టోర్ రూమ్, త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: