ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హనుమకొండ జిల్లా పరకాలలో మయూరి గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన జాతీయ కరాటే పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో జపాన్ షిటోరియు సికో కాయ్ కరాటే ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన మంథని మరియు దర్యాప్తుర్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సబ్ జూనియర్స్ మరియు క్యాడేట్స్ కథ మరియు కుమితే విభాగాలలో అత్యంత ప్రతిప కనపరిచి 9 బంగారు పథకాలు, 21 వెండి పథకాలు సాధించారు. జోగుల అభిరామ్, మాచర్ల శివ, వాసంశెట్టి ఉదయ్ కుమార్, ఎలివేణి నిషిత్, జడగాల మనస్వి, శాన్వి, అరణ్య, సహస్ర, అక్షితలు బంగారు పథకాలు, కేసరి సహస్ర, అంజలి, వైష్ణవి, బి సహస్రలతో పాటు పలువురు వెండి పతకాలు సాధించారు. పథకాలు సాధించిన వారిని శిటోరియు షికో కాయి కరాటే, కియో ఇండియా అధ్యక్షులు పి భరత్ శర్మ, తెలంగాణ ప్రతినిధి పాలకుర్తి పాపయ్య, కార్యనిర్వాహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజర్ మాడ సంపత్, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి, కోశాధికారి మల్లికార్జున గౌడ్, దర్యా పూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కేసరి సంతోష్, శిక్షకులు జడగల శివాని, ఇన్స్ట్రక్టర్స్ రామ్ శెట్టి జయకృష్ణ, నాగెల్లి రాకేష్, కావేటి శివ గణేష్ లు అభినందించారు.
Admin
E Nivas News