ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి రామగుండం పోలీసు కమిషనర్, అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు 1969 తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం, మలిదశ తెలంగాణా ఉద్యమం లో పాల్గొని దేశ వ్యాప్తంగా వేదికల ద్వారాతనప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేశారు అని తెలిపారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన స్పూర్తితో ప్రజలకు పోలీస్ శాఖ ద్వారా మరింత మెరుగైన సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె.శ్రీనివాస్ , ఏఓ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లుదామోదర్,రమేష్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News