Tuesday, 28 July 2026 08:48:08 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు...

Date : 13 March 2026 12:02 AM Views : 131

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సూర్యభానుడు దినదినం ఉగ్రరూపం ప్రదర్శిస్తుండడంతో పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచి సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత హైదరాబాద్ సహా వివిధ జిల్లా కేంద్రాల్లోని రహదారులపై జన సంచారం తగ్గుతోంది. ఓ వైపు ఎండ వేడి, మరో వైపు తీవ్రమైన ఉక్కపోత తో ప్రజలు అల్లాడిపోతు న్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించ నున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్‌ 23వ తేదీ వరకుతరగతు లు నిర్వహించుకోవచ్చు నని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంట ల వరకు పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలు కూడా కచ్చితంగా ఒంటిపూట పనిచేయాల్సి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఎవరికీ మినహాయింపు ఉండదని.. మధ్యాహ్నం తర్వాత స్కూళ్లు తెరిచి ఉండటానికి వీల్లేదని అధి కారులు స్పష్టం చేశారు.ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి.. వేసవి సెలవులపై కూడా తెలంగాణ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. ఏఫ్రిల్ 23 స్కూళ్లకు చివరి పని దినం కాగా.. ఏఫ్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ప్రారంభం అవుతాయని తెలిపింది. 2026-27 విద్యా సంవత్స రానికి సంబంధించి జూన్ 12న తిరిగి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రంజాన్ మాసం కొనసా గుతుండగా.. ఈనెల 19న రంజాన్ పండగ నిర్వహిం చుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాల సమయాల్లో మార్పులు చేస్తూ.. తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లలో టైమ్ టేబుల్ మార్చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ స్కూళ్లలో తరగతులు నడుస్తున్నాయి. ఈ టైమ్ టేబుల్ మార్చి 15 వరకు ఉండనుంది. ఆ తర్వాతఈస్కూళ్లలోనూ మధ్యాహ్నం 12.30 గంటలవరకుతరగతులు నిర్వహించనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :