ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జూన్ నాటికి లక్ష ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. అలాగేఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1.12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేస్తామన్నారు. అలాగే ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయిస్తామన్నారు. ఇళ్ల ఎంపిక కోసం గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు అధ్యక్షులుగా ఉంటారని, ఇందులో ఎమ్మెల్యేల ప్రాతినిధ్యంపై ఆలోచిస్తామని తెలిపారు.
Admin
E Nivas News