ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 10వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన పోలెపంగు బాలమైసమ్మ ఇటీవల మరణించగా వారి దశ దిన కర్మ సందర్భంగా మానవత దృక్పథంతో మాకుల తండా బోడ రమేష్ - కవిత దంపతులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని ఎస్సీ కాలానికి చెందిన ప్రజలు బోడ రమేష్ - కవిత దంపతుల సేవాభావాన్ని చూసి ప్రత్యేకంగా అభినందించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు,పోలెపంగు రాజేందర్, రామస్వామి, గురువయ్య, కోతి వెంకన్న, చంద్రయ్య, బాషిపంగు వెంకన్న, సైదులు, వెల్డింగ్ ఉపేందర్, అంబేద్కర్ యూత్ లు సభ్యులు రంజిత్ కుమార్, రాజు, మట్టే శ్రీను, విజయ్, రంజిత్, చైతన్య, శివ, మోహన్, రాకేష్, మట్టే జగదీష్, కోడూరు వెంకన్న, భాషిపంగు విజయ్, మాకుల తండా యూత్ భూక్య సంతోష్ కుమార్, బాదావత్ ప్రభాస్, బోడ అనిల్, తరుణ్, వాసు, గుగులోత్ శివాజీ, సంతోష్, పోలెపంగు బాల మైసమ్మ కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News