ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించనున్న ఇండియా ఇంటిగ్రేటెడ్ గ్రేటర్ స్కూల్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీలో ముందు వరుసలో ఉంచేందుకు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతుందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం, రవాణా సదుపాయం, విద్యార్థులకు ఏ మేరకు భద్రత ఉంటుంది, నేల స్వభావం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. సమగ్ర సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ నిర్మాణాలపై సమీక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్, అధికారులు ఉన్నారు.
Admin
E Nivas News