ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి): మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనాన్ని బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగులు ఈ గ్రంథాలయ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు. గ్రంథాలయ ఏర్పాటు కోసం సహకరించిన అశోక్ ఆర్య గురూజీని, పుస్తకాలను డొనేట్ చేసిన అభినయ్ కమలాకర్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, హౌసింగ్ ఏఈ సాజుద్దిన్, మండల అధ్యక్షురాలు లావణ్య, సత్యనారాయణ, అశోక్, శ్రీనివాస్ గౌడ్, శంకర్, శ్యామ్రావు, మారుతి, విలాస్, అశోక్ ఆర్య, అభినయ్, రాజశేఖర్, మహేష్, రంగన్న, రమేష్, బాబు, సంతోష్, ప్రశాంత్, సాయి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News