Thursday, 30 July 2026 08:14:31 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Date : 11 December 2025 06:56 PM Views : 255

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రెండవ సాధారణ స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. ప్రతి పోలింగ్ సెంటర్ లో చలిని లెక్కచేయకుండా ఓటర్లు ఉదయం నుంచే ఓటు వేయడానికి క్యూ లో బారులు తీరారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ భాస్కర్ లు పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. వెంకట్రావ్ పేట్ లోని ప్రభుత్వ పాఠశాల వద్ద 90 ఏళ్ల వృద్ధురాలు ఓటు వేయడానికి వచ్చే క్రమంలో ఇబ్బంది పడితే అక్కడే విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్సై శిరీష స్వయంగా వీల్ చైర్ లో ఓటింగ్ గది వద్దకు ఆ వృద్ధురాలును తీసుకెళ్లారు. మండలంలోని పలు గ్రామాల్లో పోలైన ఓటింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. మండలంలోని అంకతిపల్లి 87.93, బలరావ్ పేట 90.07, చందారం 76.56, దౌడపల్లి 76.01, ఎల్లారం 85.27, గుల్లకోట 82.73,హనుమంత్ పల్లె 68.33, జెండా వెంకటాపూర్ 87.44, కొత్త కొమ్ముగూడెం 84.14, కొత్తూరు 87.93, లక్ష్మీపూర్ 81.09, మిట్టపల్లి 89.09, పాత కొమ్ముగూడెం 81.77, పోతపల్లె 84.65, రంగపేట 87.84, సూరారం 87.53, తిమ్మాపూర్ 87.68, వెంకట్రావుపేట్ 76.87 పోలింగ్ నమోదు కాగా, మొత్తం మండలంలో 82.34 ఓటింగ్ శాతం అయినట్లు ఏంపీడీఓ సరోజ మీడియాకు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు గట్టి బందోబస్త్ నిర్వహించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :