ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన దుర్వ దేవుబాయి లక్ష్మణ్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు, సబితా రెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిల్ జాదవ్ నాయకత్వాన్ని బలపరచాలని, అభివృద్ధి ఎమ్మెల్యే తోనే సాధ్యమని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడాలని, పార్టీ అధికారంలోకి రాగానే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బారాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News