Friday, 11 September 2026 09:07:55 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషిన్ పంపిణీ..

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి

Date : 21 August 2026 08:20 PM Views : 97

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు "ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పంపిణీ పథకము" క్రింద ఆటోమేటిక్ కుట్టు మిషన్ లను 100 శాతం రాయితీతో అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరించడం జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నీరటి రాజేశ్వరి శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://tgobmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా సెప్టెంబర్ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళల వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలని, నిరుద్యోగ మహిళలు, పేదలు, నిరాదరణకు గురైన వితంతు, ఒంటరి,వికలాంగులకు అనాదమహిళలకు,టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. తెల్లరేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని, కనీస అక్షరాస్యత 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని,ఆధార్ కార్డు,కుల,ఆదాయ ధృవీకరణ పత్రము కలిగి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయము గ్రామీణులకు 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ వాసులకు 2 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు.2023-24 సంవత్సరంలో బి.సి. ఓకేషనల్ స్కీమ్ స్వయం ఉపాధి పథకం క్రింద ఆర్థిక లబ్ది పొందిన వారు అర్హులు కారని, పథకము మంజూరు కొరకు దరఖాస్తుదారులు డౌన్ లోడ్ చేసుకొని సంబంధిత కుల, ఆదాయ,నివాసం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు,విద్యా అర్హతలు, టైలరింగ్ శిక్షణ, అనుభవం తదితర ధృవీకరణ పత్రాలతో గ్రామీణులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, పట్టణ వాసులు మున్సిపల్ కార్యాలయంలో సెప్టెంబర్ 13వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని, ఆన్లైన్ చేసిన దరఖాస్తును సంబంధిత అధికారికి సమర్పించనిచో ఆ ధరఖాస్తు పరిగణలోకి తీసుకోబడదని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: