Sunday, 13 September 2026 12:01:08 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

కన్నుల పండవగా కార్తీక పౌర్ణమి జాతర

భక్త జన సందోహంతో క్రిక్కిరిసిన ఆలయం

Date : 05 November 2025 07:08 PM Views : 310

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యదేవుని ఆలయం లో కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం భక్తులు కార్తీక పౌర్ణమి జాతరను కన్నుల పండవగా జరుపుకున్నారు. వేలాదిమంది భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తజన సందోహంతో క్రిక్కిరిసిపోయింది. ఉదయం నుండి భక్తులు తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుండి కూడా వేలాదిమందిగా తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. సామూహిక సత్యనారాయణ వ్రత మండపంలో సుమారు 1300 జంటలు సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ఒకేసారి వేలాదిమందిగా భక్తులు తరలిరావడంతో వచ్చిన వారందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎండ బారిన పడకుండా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరును అందుబాటులో ఉంచారు. పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో వాలంటీర్లు వచ్చిన భక్తులకు సేవలు అందించారు. గోదావరి వద్ద స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి భద్రత చేపట్టారు. భక్తులు సత్యదేవుని దర్శించుకున్న అనంతరం సమీపాన్ని గల అభినవ శబరిమల అయ్యప్ప ఆలయంతో పాటు సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదుట గల రావి చెట్టు వద్ద మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో పాటు డీసీపీ భాస్కర్ ఎసిపి ప్రకాష్ లు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వీరిని సాంప్రదాయ రీతిలో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి చిత్రపటాలతో అందజేసి శాలువాలతో సత్కరించారు. ట్రాఫిక్ కు ఎలాంటి సమస్య తలెత్తకుండా సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం ఎస్సైలు గోపతి సురేష్, తహసీనుద్దీన్, అనూష, పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :