ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ- ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం విశ్రాంతి భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షురాలుగా సురేఖమ్మ పార్టీపై నిబద్ధతను, ప్రజల పట్ల ఉన్న సేవ తపనను నాయకులు ప్రశంసించారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం అయిందని, సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆమె మంచిర్యాల జిల్లాకే ఉక్కు మహిళగా, పేదల పెన్నిధి అని తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీ ఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్,మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు పలు వార్డ్ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News