ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళలు పండుగలు సంతోషంగా జరుపుకోవాలని కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ లక్ష్మని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం బతుకమ్మ పండుగకు ఇవ్వవలసిన చీరలను సంక్రాంతి పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 1,2,3,4,5,6,10,11,12,13,14,15 వార్డుల్లోని ఆడపడుచులందరికీ చీరాలను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అందజేశారు. అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News