ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలుగు భాష సంరక్షణ సంఘం తెలంగాణ సాహితి సంస్థ ఏటా ప్రధానం చేస్తున్న రాష్ట్రస్థాయి బుర్ర నర్సమ్మ- లింగారెడ్డి,స్మారక తెలంగాణ తెలుగు తేజం,పేరుతో ఇచ్చే సాహిత్య పురస్కారం 2026 కు ప్రముఖ కవి జాతీయ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు. ఈ మేరకు పురస్కార కమిటీ చైర్మన్ అవా ర్డు వ్యవస్థాపకులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి,ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధ్యాసం సేనాధిపతి శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఈ పురస్కార ప్రధాన ఉత్సవం ఈ నెల 22న కరీంనగర్ పట్టణంలో నిర్వహించనున్నట్లు వివరించారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టి బిడ్డలు చేసిన అమూల్య సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
Admin
E Nivas News