Tuesday, 28 July 2026 07:03:21 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

10న రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏపీ సెట్ పరీక్షలు..

Date : 09 May 2026 04:28 PM Views : 104

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రవ్యా ప్తంగా టీజీ ఈ ఏపీ సెట్- 2026 ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కొరకు ఆదివారంనుండి పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మొత్తం 6 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నా యి. ఈ ఏడాది మొత్తం 2,10,766 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు.మార్నింగ్ సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందుగానే తమ పరీ క్షా కేంద్రాన్ని చేరుకునే విధంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవా లని అధికారులు సూచించారు.ఉదయం సెషన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థు లను ఉదయం 7:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమ తిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మధ్యాహ్న సెషన్‌లో పరీక్ష రాసే విద్యార్థు లను మధ్యాహ్నం 1:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అను మతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత, అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్య ర్థులను పరీక్షా కేంద్రా ల్లోకి అనుమతించ బోమని, ఈఏపీసెట్ కన్వీనర్ డాక్టర్ కే విజయ్ కుమార్ రెడ్డి, శనివారంఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు పాటించవలసిన జాగ్రత్త లు.. అభ్యర్థులు తప్పని సరిగా బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డు వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరీక్షా కేంద్రాల్లో నిషేధమని స్పష్టం చేశారు. పరీక్ష పూర్తైన వెంటనే స్క్రీన్‌పై మార్కుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా నార్మలైజ్డ్ మార్కులు లెక్కించి ర్యాంకులను కేటాయిం చనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: