ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థులు నిరంతర సాధన ద్వారానే విజయం సాధించడం సాధ్యం అవుతుందని ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ)ఉష అన్నారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు. కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధన కొనసాగుతుందన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్ లో విశాలమైన తరగతి గదులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ అంబరీష్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఈ కళాశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చి ప్రయోజనం పొందాలన్నారు. ఏ ఐ కాలంలో మారుమూల ప్రాంతాల పిల్లలు వెనకపడకూడదు అనే ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ కళాశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ సయ్యద్ సలీం మాట్లాడుతూ తాను ఇక్కడే పని చేసి పదవీ విరమణ పొందానని, ఈ కళాశాల గుర్తులు ఎన్నడూ మరచిపోలేనివి అన్నారు. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చేపట్టిన సాంసృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు, తిరుపతి, తిరుమల్, శశాంక్, నగేష్, శ్రీదేవి, ఎల్ ఆర్ కే రెడ్డి, సబిత, మౌనిక, సురేష్, దీపారాణి, సిబ్బంది బియ్యబాని, రాజయ్య, అనసూయ, ప్రభాకర్ పాల్గొన్నారు.
Admin
E Nivas News