ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం జిల్లా ఇన్చార్జ్ అజ్మీర శాం నాయక్ ఆయన క్యాంపు కార్యాలయంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనిరుపేద కుటుంబాలకు ఒక వరం లాంటిదని తెలిపారు. నిరుపేదలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా ముందుంటుందన్నారు. అనారోగ్య కారణాలతో వైద్యం చేసిన బాధితులకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం నియోజకవర్గంలోని ముగ్గురు లబ్ధిదారులకు సహాయ చెక్కులు ఇచ్చారు. కెరమెరి మండలం, రింగన్ ఘాట్ గ్రామం కు చెందిన లేనుగురే సజాన్ రూ"48,000, ఆసిఫాబాద్ మండలం, రహపల్లికి చెందినపెద్దపల్లి కళ్యాణి రూ"20,000రెబ్బెన మండలం, నారాయణ పూర్ గ్రామం – దుర్గం మొండి రూ"15,000 చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, వైస్ చైర్మన్ గాజుల రవీందర్, డైరెక్టర్ విశ్వనాథ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కుర్సింగ శోభన్, సీనియర్ నాయకులు ఎం.డి. నిజాం, నారాయణ పూర్ మాజీ సర్పంచ్ వెంకటేష్ తదితరులుపాల్గొన్నారు.
Admin
E Nivas News