ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్ టోల్గేట్ సమీప ప్రాంతంలో ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంథని పట్టణానికి చెందిన పెండ్రు సుమంత్ రెడ్డి తన పెద్ద కూతురు పుట్టిన రోజును పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లాలోని రామప్ప, మేడారం జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం బయలుదేరారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుమంత్ రెడ్డి భార్య, పెద్దకూతురు, చిన్న కూతురు, సుమంత్ రెడ్డి అక్క, ఆమె కుమార్తెకు గాయాలయ్యాయి. కారు ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన హన్మకొండ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, కిసాన్ సెల్ పెద్దపల్లి జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి. నారాయణరావు తదితరులు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
Admin
E Nivas News