Saturday, 12 September 2026 11:59:21 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

గ్రంథాలయమే జ్ఞాన మార్గానికి మార్గదర్శి...

ఘనంగా గ్రంథాలయ జ్ఞానోత్సవం

Date : 15 May 2026 10:52 PM Views : 219

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో జరుగుతున్న విద్యావారోత్సవాల్లో అయిదవ రోజైనా శుక్రవారం మన గ్రంథాలయ జ్ఞానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షతలో కళాశాల లైబ్రేరియన్ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో కళాశాల గ్రంథాలయం వెబ్ సైట్ ప్రారంభం, బుక్ ఎగ్జిబిషన్, పుస్తకాల విరాళం , కొత్త పుస్తకాల ఆవిష్కరణ, పుస్తక సమీక్షలు విద్యార్థులకు పోటీలు ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ కళాశాల గ్రంథాలయం గూగుల్ వెబ్ సైట్ తో పాటు బుక్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ మాట్లాడుతూ గ్రంథాలయాలు జ్ఞానం పెంచడానికి మార్గదర్శిగా పనిచేస్తాయన్నారు. ఒక్కో పుస్తకం ఒక్కో జీవితాన్ని పరిచయం చేసి సమున్నతమైన ప్రతిభ పొందడంలో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు .విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగ పరుచు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల తెలుగు అధ్యాపకులు రచించిన వెన్నెల సాహచర్యం ఈ - పుస్తకాన్ని, తెలుగు విభాగం నిర్వహించిన సృజనాత్మక రచన కార్యశాల సావనీర్ పుస్తకాన్ని ప్రిన్సిపాల్ ఆవిష్కరించారు. విద్యార్థులు సృజనాత్మక రచనలో ప్రావీణ్యం సంపాదించాలని పేర్కొన్నారు. లైబ్రేరియన్ నాగేశ్వర్రావుమాట్లాడుతూ గ్రంథాలయాన్ని ప్రతిరోజు సందర్సించడం ద్వారా పుస్తకాలు మాత్రమే కాకుండా డిజిటల్ లైబ్రెరీ వాడకాన్ని కూడా అలవర్చుకోవాలని ప్రపంచంలోని పుస్తకాలన్నీ ఉచితంగా సౌకర్యం డిజిటల్ లైబ్రెరీ కల్పింస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం అధ్యాపకులు ప్రజలు పుస్తకాలను లైబ్రెరీలకు విరాళంగా ఇవ్వాలని కోరారు. పలువురు అధ్యాపకులు గ్రంథాలయ జ్ఞానోత్సవం సందర్భముగా కాలేజీ లైబ్రెరీకి విలువైన పుస్తకాలను విరాళంగా ఇచ్చారు. గ్రంథాలయాన్ని రోజు సందర్సించిన ఉత్తమ విద్యార్థులకు పుస్తకాలను బహుమతులుగా ఇచ్చారు .కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్, లైబ్రేరియన్ నాగేశ్వర్ రావు తో పాటు అధ్యాపకుల శంకరయ్య , ప్రేమలత, తన్నీరు సురేష్, తిరుపతి, శ్రీనివాస్, రాజ్ కుమార్, కవిత, సంధ్యారాణి , స్వప్న, స్వామి , ప్రసన్న, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :