ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి సోమవారం కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని పెద్ద తల్లి ఎంపీ గడ్డం వంశి, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ చర్చల జరిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో కలిసి కేంద్ర నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రి, విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని సోమవారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల విస్తరణ, యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు, ఐటీఐల బలోపేతం, కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకాల సమర్థ అమలు వంటి అంశాలపైచర్చించారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ టి సి ఎస్ ఏర్పాటు చేసి, స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ అందించడంతో పాటు, శిక్షణ అనంతరం పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి కోరారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా కార్యక్రమాల ద్వారా మరిన్ని శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, సర్టిఫికేషన్, ప్లేస్‌మెంట్ అవకాశాలను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై స్పందించిన కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సంబంధిత ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, ఏర్పాటు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల విస్తరణ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Admin
E Nivas News