Thursday, 30 July 2026 04:16:44 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

రెండు గంటల్లో దొంగతనం చేసిన నిందితుడి అరెస్ట్...! వంద శాతం ఆభరణాల రీకవరి

ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

Date : 10 February 2026 09:29 PM Views : 117

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును జైనథ్ పోలీసులు రెండు గంటల్లోనే చేదించి, దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను 100 శాతం తిరిగి స్వాధీనం చేసినట్లుఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. తెలిపిన వివరాల ప్రకారం.. సాత్నాల మండలం కెనాల్ మేడిగూడ గ్రామానికి చెందిన నిందితుడు గుమ్మడి రవీందర్ (32) కూలి పని చేస్తూ మద్యానికి బానిసై ఖర్చుల కోసం డబ్బులు అవసరమై అదే గ్రామంలో నివసించే బరపటి వెంకటి ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో నిందితుడు ఇంటిలోకి చొరబడి బీరువా తాళం తీసి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగలించి తన ఇంటి వద్ద మట్టిలోదాచిపెట్టాడు. దొంగతనం విషయం వెలుగులోకి రావడంతో వెంటనే జైనథ్ పోలీస్ స్టేషన్ నందు 34/2026 అండర్ సెక్షన్ 331(3),305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి, వెంటనే రంగంలోకి దిగిన జైనథ్ పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం అతని ఇంటి సమీపంలో మట్టిలో దాచిన ఆభరణాల డబ్బాను వెలికితీసి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు సుమారు 3½ తులాలు, వెండి ఆభరణాలు సుమారు 50 తులాలు, రాగి వస్తువులు సుమారు 8 తులాలు, మొత్తం దొంగలించిన వస్తువులు విలువ రూ 5,04,500 దొంగతనం కేసును రెండు గంటల్లోనే చేదించి, దొంగిలించిన ఆస్తిని 100 శాతం రికవరీ చేసిన జైనథ్ పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ప్రజల భద్రత కోసం ఇదే విధంగా అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఈ కేసును చేదించడంలో కీలకపాత్ర పోషించిన జైనథ్ సిఐ జి శ్రావణ్ ను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :