Monday, 14 September 2026 07:31:13 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఎమ్మెల్సీ దండే విటల్ ఎక్స్ ఆఫీసియో సభ్యుడు కాదు...

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

Date : 14 February 2026 09:28 PM Views : 270

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో మున్సిపల్ సమావేశం నేపథ్యంలో రాజకీయ వివాదం నెలకొంది. ఈ విషయంపై కోనేరు కోనప్ప తీవ్ర ఆరోపణలు చేశారు. కోనేరు కోనప్ప శనివారం తన నివాసంలో మీడియా ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎమ్మెల్సీ దండే విఠల్ మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు లేనప్పటికీ తప్పుడు పత్రాలు సృష్టించి ఓటరు జాబితాలో తన పేరు చేర్చించుకుని ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొని ఓటు వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఈ నెల 16న జరగనున్న మున్సిపల్ సమావేశంలో ఇటీవల గెలిచిన కౌన్సిలర్లతో పాటు ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ సమావేశానికి ఎక్స్ ఆఫిషియో సభ్యులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ఆదేశాలు, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు వినియోగించే ప్రజా ప్రతినిధులకే ఎక్స్ ఆఫిషియో హోదా వర్తిస్తుంది. కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దండే విఠల్ పాల్గొనలేదని, ఓటు కూడా వేయలేదని, ఆ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్ట్‌లో ఆయన పేరు లేదని కోనప్ప తెలిపారు. అదనంగా విడుదలైన చేర్పుల జాబితాలో కూడా పేరు లేదని పేర్కొన్నారు. గత 10–15 రోజులలో కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కూడా జరగలేదని చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటర్ లిస్ట్‌లో దండే విఠల్ పేరు ఉన్నట్లు చూపించడం అనుమానాస్పదమని, ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల కమిషనర్ పూర్తి స్థాయి విచారణ జరిపి, దండే విఠల్‌ను ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా కొనసాగించకూడదని డిమాండ్ చేశారు. ఈ వివాదం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :