ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : బంగ్లాదేశ్ లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్యలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ దేశ వ్యాప్త నిరసనల పిలుపు మేరకు బుధవారం మంథనిలో నిరసన ర్యాలీ చేపట్టి జిహాదీల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూపరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండ, ఇటీవల దీపు చంద్ర కిరాతక హత్యను ప్రతి హిందువు ఖండిచాలన్నారు. హిందువుల పైన దాడులు మతోన్మాద చర్యలు సహించేది లేదని, మూర్ఖపు మతోన్మాద చర్యలని తిప్పి కొడతామన్నారు. బజరంగ్ దళ్ హిందువుల రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడేదిలేదని, ఈ సంఘటనతో మతోన్మాద జిహాదీ ముస్లింల చర్యలకి తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వహిందు పరిషత్ మంథని ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, బజరంగదల్ ప్రముక రాజేష్, ధర్మాజగరణ కనుకుంట్ల స్వామి, గర్రెపల్లి వెంకటేశ్వర్లు, కెక్కెర్ల అనిల్, కొమురవెల్లి హరీశ్, మెడగొని రాజమౌళి గౌడ్, తూర్పటి రాము, వడ్ల కొండ శ్రావణ్, నరేందర్ రెడ్డి, ఎల్లంకి హరీష్, శేఖర్, అజయ్, చరణ్, సాయికృష్ణ, నాగేష్, భజరంగ్ దళ్, హిందూ బంధువులు తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News