Saturday, 12 September 2026 10:22:04 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

కొత్త లేబర్ కోడ్‌లు' ఎవరికోసం..?

Date : 07 February 2026 10:13 PM Views : 312

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మోడీ ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్‌ల గా మార్చింది. 1.వేజెస్ కోడ్ (2019) 2 ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ (2020) 3 సోషల్ సెక్యూరిటీ కోడ్ (2020) 4 ఆక్యుపేషీనాల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్క్ కండిషన్స్ (ఓఎస్ హెచ్) Code (2020) ఇవి ప్రధానంగా రెండు వర్గాల కోసం రూపొందించబడినట్లు ప్రభుత్వం చెప్పింది. *ప్రభుత్వం ప్రకారం కోడ్‌ల లక్ష్యం* జీతాల్లో సమానత దేశంలోని అన్ని రంగాల్లో కనీస వేతనం ఒకే విధంగా ఉండడం, పని చేసే వారికి సురక్షిత వాతావరణం, పనిస్థలాల్లో భద్రత, ప్రమాదసమయంలో ఎక్కువ పరిహారం, మహిళలకు రాత్రి డ్యూటీపై రక్షణ నిబంధనలు చేయటం. *ఒకే చట్టంలో అన్ని నిబంధనలు* కార్మికులకు చట్టాలపై స్పష్టత పెరగడం, కార్ఖానాదారులు, కంపెనీలు, ఇండస్ట్రీలు కోసం ఇవి కూడా చాలా ప్రయోజనాలు పొందేలా కోడ్‌లు రూపొందించబడ్డాయి. *కంపెనీలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్* 29 చట్టాల బదులు 4 కోడ్‌లు, తక్కువ పేపర్ వర్క్, తక్కువ తనిఖీలు జాగ్రత్త సమస్యలు కూడా ఉన్నాయి. *ఉద్యోగులను తొలగించడానికి సులభతరం* 300 మందికి దిగువ ఉన్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా రిటర్నహేన్స్ చేయవచ్చు.పాత చట్టంలో 100 మంది ఫ్లెక్సిబుల్ వర్క్ సిస్టమ్ పని గంటలను పెంచే అవకాశం 12 గంటల వరకు, వారానికి 48 గంటలు మించకూడదు) కాంట్రాక్ట్‌పై మరింత ఆధారపడే అవకాశాలు ఎక్కువ. *కోడ్‌లు ఎవరికే ఎక్కువ ప్రయోజనం?* ప్రభుత్వం చెబుతున్న దృష్టి రెండు వర్గాలు కార్మికులకు భద్రత, కంపెనీలకు సౌలభ్యం. కానీ విమర్శకులు చెప్పేది ప్రధానంగా కంపెనీలకు కొన్ని నిబంధనలు కార్మికుల కంటే కార్ఖానాదారులకు ఎక్కువ లాభం. ఉద్యోగులను సులభంగా తొలగించడానికి అవకాశం, పని గంటలు పెరగడం, యూనియన్‌లు ఏర్పరచడం కఠినతరంగా మార్చడం మంచి పద్ధతి కాదు. *స్ట్రైక్‌లపై నియంత్రణ* ప్రభుత్వ ఉద్దేశంలో దేశంలో కార్మిక చట్టాల్ని సులభతరం చేసి, పెట్టుబడులు పెంచి, ఉద్యోగాలను పెంచడం. *కార్మిక సంఘాల అభిప్రాయం* కొత్త కోడ్‌లు కార్మిక హక్కులను బలహీనపరుస్తాయి. కంపెనీలకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తాయి.మోడీ ప్రభుత్వ లేబర్ కోడ్‌లు "కార్మికులకు రక్షణ, కంపెనీలకు స్వేచ్ఛ" అని చెప్పినా వ్యవహారంలో కంపెనీలకు ఎక్కువ లాభం కలిగించేలా ఉన్నాయనే విమర్శ ఎక్కువగా వినబడుతుంది. ఇక్కడ మోడీ ప్రభుత్వ 4 లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు వచ్చే లాభాలు, నష్టాలు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. దేశ వ్యాప్తంగా ఒకే విధమైన కనీస వేతనం ఉండాలి. పాత చట్టాల్లో రాష్ట్రానికి రాష్ట్రం కనీస వేతనాలు గందరగోళంగా ఉండేవి. కొత్త కోడ్ యూనిఫామ్ వేజ్ డెఫినేషన్ తో జీతం లెక్కింపు స్పష్టం, బేసిక్ వేతనం కనీసం 50 శాతం అవ్వాలి. పి ఎఫ్, గ్రాట్యూటీ వంటి ప్రయోజనాలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఈ పి ఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యాలు మరింత కార్మికులకు సోషల్ సెక్యూరిటీ కోడ్ ప్రకారం ఏపీఎఫ్, ఈ ఎస్ ఐపరిధి పెరుగుతుంది. గిగ్ వర్కర్లకు (ఓల, స్విగ్గి, జోమటో వర్కర్లు) కూడా భద్రత, వికలాంగులు, ప్రసూతి సౌకర్యాలు మెరుగ్గా, ప్రమాద సమయంలో పరిహారం పెరుగుతుంది. అయితే పెద్ద కంపెనీల్లో మరణం, గాయాలకు ఎక్కువ క్యాంపెన్సేషన్, భద్రతా ప్రమాణాలు తప్పనిసరి, మహిళలకు పని చేసే అవకాశాలు పెరుగుతాయి. కొత్త కోడ్ ప్రకారం రాత్రి షిఫ్ట్‌లో పని చేసే అవకాశం, కానీ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలి

*ఒకే చట్టంలో అన్ని నిబంధనలు* 29 చట్టాల బదులు 4 కోడ్‌లు రావడంతో కార్మికులకు తమ హక్కులు అర్థం చేసుకోవడం తేలిక ఉద్యోగ ఒప్పందాలపై స్పష్టత ఉద్యోగ భద్రత తగ్గే అవకాశం ఉంది. *ఇండస్ట్రియల్ కోడ్ లో ప్రధాన మార్పు* 300 మందికి దిగువ ఉద్యోగులతో ఉన్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులను తొలగించగలవు (పాత చట్టంలో లిమిట్ 100 మంది) దీని వల్ల ఉద్యోగ భద్రత 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. *పని గంటలు పెరిగే అవకాశం* కొత్త కోడ్ ప్రకారం రోజుకు 12 గంటల వరకు పని చేయించవచ్చు. వారానికి 48 గంటలు మాత్రమే అన్నప్పటికీ దీంతో కంపెనీలు లాంగ్ షిఫ్ట్‌ల కు ప్రోత్సహించవచ్చు. యూనియన్‌లకు అడ్డంకులు పెరుగుతాయి. యూనియన్ స్థాపనకు కనీసం 10 శాతం కార్మికుల మద్దతు తప్పనిసరి. స్ట్రైక్‌లపై కఠిన నిబంధనలు, 60 రోజుల ముందస్తు నోటీసు లేకుండా సమ్మె చేయరాదు. ఇది కార్మిక పోరాటాన్ని బలహీనపరుస్తుందని విమర్శ. కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉంది. కొత్త కోడ్‌లలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ అను పద్ధతి ప్రోత్సహించబడింది. దీని వల్ల తాత్కాలిక ఉద్యోగాలు ఎక్కువ,శాశ్వత ఉద్యోగాల అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. 'బేసిక్ వేతనం 50 శాతం' నిబంధన వల్ల నికర జీతం తగ్గవచ్చు. బేసిక్ పెరిగితే పీఎఫ్ కట్టుబడి కూడా పెరుగుతుంది. చేతికొచ్చే జీతం తగ్గుతుంది. కంపెనీలు సిటిసిని అదే ఉంచి ఉద్యోగి టేక్-హోమ్ జీతం తగ్గించే అవకాశం *అమలుపై అనేక సందేహాలు* రాష్ట్రాలు ఇంకా కోడ్‌ల నిబంధనలు అమలు చేయలేదు. బలహీన వర్గాల కార్మికులకు అవగాహన తక్కువ,చిన్న కంపెనీలు చట్టం తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. *లాభాలు,నష్టాలు* జీతాల స్పష్టత, ఈపీఎఫ్, ఈ ఎస్ ఐ భద్రత పెరగడం, ప్రమాద పరిహారం పెరగడం, గిగ్ వర్కర్లకు భద్రత, మహిళా ఉద్యోగుల రక్షణ, ఉద్యోగ భద్రత బలహీన పడే అవకాశం, పని గంటలు పెరగడం, యూనియన్ హక్కులు తగ్గడం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరగడం, చేతికొచ్చే జీతం తగ్గే అవకాశం ఉంది. --డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :