ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న రీ- సర్వే, ఎస్ఐఆర్ ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం ఆయెపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను మండల తహసీల్దార్ రాఘవేంద్ర తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రీ-సర్వే ప్రక్రియలో నిర్దేశిత విధానాలను తప్పనిసరిగా పాటించాలని, ఫీల్డ్ రిజిస్టర్, విలేజ్ రిజిస్టర్‌లలో వివరాలు నమోదు చేస్తూ, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, రీ-సర్వే పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కోటపల్లి మండలం అల్గావ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తహసీల్దార్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ లో భాగంగా చేపట్టిన విచారణను పరిశీలించి ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం భీమారం మండలం అంకుశాపూర్ గ్రామంలోని సమతా అగ్రో ఇండస్ట్రీస్ ను తహసీల్దార్ సదానందం తో కలిసి సందర్శించి, పెండింగ్‌లో ఉన్న సిఎంఆర్ బియ్యం వివరాలను అడిగి తెలుసుకొని,సిఎంఆర్‌కు సంబంధించిన పెండింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.మండలంలోని ప్రతిపాదిత నూతన మండల రెవెన్యూ కార్యాలయం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. రీ-సర్వే పనులను సమీక్షించి, సర్వేకు సంబంధించిన వివరాలను ఫీల్డ్ రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు, అన్ని సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News