Friday, 11 September 2026 07:39:41 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్..

Date : 10 September 2026 09:33 PM Views : 16

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లాలో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు పోలీస్‌, అటవీ శాఖలు పరస్పర సమన్వయంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌, సూచించారు. గురువారం జగిత్యాలజిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో పోలీస్‌, అటవీ శాఖల అధికారులతో నిర్వహించిన కోఆర్డినేషన్‌ సమావేశంలో జిల్లాలో అటవీ పరిరక్షణకు సంబంధించి చేపడుతున్న చర్యలు, ఇరు శాఖలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరస్పర సహకారం అవసరమైన అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేట, అటవీ భూముల ఆక్రమణ తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూఅటవీ భూములు ఆక్రమణ, అక్రమ కలప రవాణా, వన్యప్రాణుల వేటను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెంచాలని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై సమాచారాన్ని సేకరించి చట్టపరంగా కఠినచర్యలుతీసుకోవాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు, అటవీ శాఖకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పోలీస్‌ శాఖతో పంచుకోవాలని సూచించారు. అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ పేర్కొన్నారు. అటవీ భూముల్లో అనధికారికంగా చేపడుతున్న కార్యకలాపాలను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా వేటగాళ్ల కదలికలపై నిఘా పెంచాలని, అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలతో సమన్వయం చేసుకుని అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించాలని తెలిపారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవాణా, అటవీ భూముల ఆక్రమణ వల్ల కలిగే నష్టాలపై వివరించాలని సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: