Tuesday, 28 July 2026 11:38:43 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

గోదావరిజలంతో నాగోబాకు ఆలయానికి కాలినడకన

గోదావరిలో పూజల తర్వాత జలం తిరుగు పయనం

Date : 07 January 2026 09:52 PM Views : 198

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి హస్తినా మడుగు రేవులో మెస్రంవంశీయులు ప్రత్యేక పూజలు అనంతరం కలశంలో పవిత్ర జలాన్ని తీసుకొని కెస్లాపూర్ నాగోబా జాతరకు బుధవారం మధ్యాహ్నం తిరుగు పయనమయ్యారు. గిరిజనుల ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జాతరైన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతర. ఈ జాతర ఈనెల 18న ప్రారంభమై 25న ముగిస్తుంది. గోదావరి జలంతో తిరిగి బయలుదేరిన మెస్రంవంశీయులు ఈనెల 18న కెస్లాపూర్ లోని నాగోబా ఆలయంలో మహా పూజతో ప్రారంభమై, వారం పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో మెస్రంవంశీయులు ప్రత్యేక పూజలు చేస్తూ ఈనెల 25న నాగోబా జాతర ముగిస్తుంది. మెస్రం వంశీయులలోని పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్, పూజారి(కటోడ) కోసేరావు, తదిత 100 మంది మెస్రంవంశీయుల ఆధ్వర్యంలో కలమడుగు హస్తినమడుగులో ప్రత్యేక పూజలు చేసి నది జలాన్ని కలశంలో తీసుకొని అనంతరం సహాపంక్తి భోజనాలు చేసి కెస్లాపూర్ కు క్యూ లైన్ లో కాలినడకన తిరుగు పయనం అయ్యారు. రాత్రి జైనూరు మండలంలోని పిట్టగూడ కటోడ ఇంట్లో వారంతా రాత్రి భోజనాలు చేసి అక్కడే పడుకుంటారు. మరుసటి రోజు అక్కడి నుండి బయలుదేరి ఈ నెల 14న ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రదేవి వద్దకు చేరుకొని, బసచేసి ఆ తర్వాత వారంతా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని గిరిజనులు కూడా హాజరై, ఎంతో ఆరాధ్యంగా జాతరను జరుపుకుంటారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :