ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామంలో ఆదివాసి రైతు మండిగ రాములు చేనులో ఏర్పాటు చేసిన సోలార్ మోటర్ పంపును బుధవారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రెబ్బెన గ్రామంలో 5గురు ఆదివాసి రైతులకు పైలెట్ ప్రాజెక్టు కింద సోలార్ మోటార్ పంపులు బిగించడం జరిగిందని, తద్వారా వారికి రెండు పంటలు పండించుకునే అవకాశం చిక్కిందని తెలిపారు. త్వరలో ఇందిర గిరి జల వికాసం పథకం కింద గిరిజనులకు వారి చేలల్లో సోలార్ వాటర్ పంపులను ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సర్పంచ్ నందిపేట రాజం, ఉప సర్పంచ్ గువ్వల పోషం, రైతులు సుంకే లాస్మయ్యా, నాయిని అంజయ్య, మందిగ శంకరి, నాయిని పుల్లయ్య, నాయకులు ఎడ్ల శంకరి,పులబోయిన వెంకటేష్, కారెం సతీష్ తదితరులుపాల్గొన్నారు.
Admin
E Nivas News