Friday, 11 September 2026 07:39:26 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

Date : 10 September 2026 09:44 PM Views : 27

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కులాల అమావాస్య వేడుకలను గురువారం రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ పట్టణంలో ‘ఏడ్ల పోలాల అమావాస్య’ వేడుకలను రైతులు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహించారు. తమకు వ్యవసాయంలో తోడుగా, అండగా నిలిచే ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా దస్నాపూర్ రైతులు తమ ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, పూలమాలలతో అందంగా తీర్చిదిద్ది డప్పు వాయిద్యాలు, మంగళ హారతుల నడుమ పట్టణంలో కోలాహలంగా ఊరేగించారు. అనంతరం స్థానిక అంకమ్మ రాజుల ఆలయానికి చేరుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పశువులు, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్, కౌన్సిలర్ లతో కలిసి హాజరై రైతులకు పోలాల అమావాస్యశుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్ లు మాట్లాడుతూ "మన దేశంలో సంస్కృతీ సంప్రదాయాలను, ప్రకృతిని, పశువులను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది అన్నారు. కంటికి రెప్పలా కాపాడే ఎద్దులను పూజించడం రైతులకు, మూగజీవాలకు ఉన్న అవినాభావ సంబంధానికి నిదర్శనం అన్నారు. నిరంతరం కష్టపడే రైతన్నలు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని, ఈ ఏడాది కాలం కలిసివచ్చి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆశిస్తున్నాం అన్నారు. పట్టణ పరిధిలోని రైతుల సమస్యలపరిష్కారానికి, సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తాం" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బిన్ అహ్మద్, బాలకృష్ణ, బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బీన్ అబ్దుల్లా, బీ ఆర్ ఎస్ నాయకులు అశోక్, సాయి శ్రావణ్, పొన్నాల నారాయణ వివిధ గ్రామాల రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: