ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన పెంపుదలకు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ( టి జి సి ఎస్ బి ) ఆధ్వర్యంలో “ ఫ్రాడ్ కా పుల్ స్టాప్ ” పేరుతో 6 వారాల రాష్ట్రవ్యాప్త సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ, టి జి సి ఎస్ బి డైరెక్టర్ షికా గోయల్, సీనియర్ అధికారులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులుమంగళవారం ప్రారంభించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం కమీషనరేట్ పరిధిలో రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా కమీషనరేట్ లోని పోలీస్ అధికారులు తమ పరిధిలోని విద్యార్థులు 2-12-2025న మధ్యాహ్నం 2.30 గంటలకు జూమ్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థుల అవగాహన కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహించారు. అనంతరం ఆన్‌లైన్ ద్వారా ప్రతిజ్ఞ తీసుకోవడం, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆరు వారాలపాటు సైబర్సారథి@1930, స్కామ్ సే బచో ,పైసా పైలం, హార్ స్క్రీన్ సురక్షిత్ ,మేరా లాగిన్, మేరా రూల్ 6.మహిళారక్షణ పిల్లల సంరక్షణ, 1930 హెల్ప్‌లైన్, గోల్డెన్ అవర్ రిపోర్టింగ్ ప్రాముఖ్యత, ఏఐ ఆధారిత నివేదన వేగవంతం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుం దన్నారు . సైబర్ మోసాల నివారణకు సమయానికి ఫిర్యాదు చేయడం, అవగాహనతో వ్యవహరించడం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి పౌరుడు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫ్రాడ్ కు ఫుల్ స్టాప్ తెలంగాణలో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసే ముఖ్య కార్యక్రమం.” అన్నారు. ప్రజలలో అవగాహన కల్పించడం కోసం టి జి సి ఎస్ బి పోస్టర్లు, ఆడియో క్లిప్‌లు, జింగిల్స్, ఇతర అవగాహన అంశాలు ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు, పోలీస్ స్టేషన్లు, మార్కెట్లు మరియు ఇతర ముఖ్యమైన ప్రజా సంబందింత ప్రాంతం లలో ఏర్పాటు చేస్తాం అని, సోషల్ మీడియా లో అవగహన ప్రచారం ఎన్సిసి ,ఎన్ఎస్ఎస్ క్యాడేట్స్, సైబర్ క్లబ్స్ ద్వారా ప్రతి కాలేజీ నుండి ఇద్దరు సైబర్ వాలంటీర్లు ఎంపిక చేసి, ప్రతి కాలేజీ నుంచి మొత్తం 5 మంది విద్యార్థులు, ఒక టీచర్ ఈ క్లబ్‌లో భాగస్వామ్యం చేసి వీరి ద్వారా తమ కాలేజీలోనే కాకుండా ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో సమన్వయంతో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులలో ఈ అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తూ రామగుండం పోలీస్ కమీషనరేట్ ఆరు వారాలపాటు ఒక్కో వారం ఒక్కొక తీమ్ తో పోలీస్ స్టేషన్ స్థాయి ప్రతి స్టేషన్‌లో వారానికి ఒక అవగాహన కార్యక్రమం, సైబర్ వారియర్స్ ద్వారా టీజీ సి ఎస్ బి, డి4 సి ఎస్,సీసీపీఎస్ అధికారులతో సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయండి. ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే కార్యక్రమం సత్పలితం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, సిసిపిఎస్ ఏసీపీ రంగారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిసిపిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి, ఆర్ ఎస్ ఐ. మారుతీ, ఎన్ సిసి, ఎన్ ఎస్ ఎస్ క్యాండేట్స్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News