ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు పెండింగ్ లో ఉన్న జీతాలను ఈపీఎఫ్,ఈఎస్ఐ డబ్బులను జమ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో గురువారంఆసుపత్రి సూపరిండెంట్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు ఒకటవ తేదీనే అవుట్సోర్సింగ్ వర్కర్లకు జీతాలు రావడం లేదని ఆన్నారు. అవుట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ హాస్పటల్ లో సెక్యూరిటీ గార్డు, పేషెంట్ కేర్, స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నరు. ప్రభుత్వం నుండి 1 నెల బడ్జెట్ వచ్చినప్పటికీ సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదన్నారు. ప్రతి నెల నెల జీతాలు ఏజెన్సీ కాంట్రాక్టర్ చెల్లించకపోవడంతో ఇంటి అద్దెలు,పిల్లల చదువులు, రోజువారి ఖర్చులకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.ప్రస్తుతం రెండు నెలల జీతాలు , మూడు నెలల ఈపీఎఫ్, ఈఎస్ఐ డబ్బులను వెంటనే జమ చేయలన్నారు. లేకపోతే జిల్లా కలెక్టర్, డీసీహెచ్, సదరు ఏజెన్సీ పై చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి శానిటేషన్ వర్కర్లు జానకి దీపా లక్ష్మి జోత్స్న కనకమహాలక్ష్మి సృజన భాగ్యలక్ష్మి లావణ్యవరలక్ష్మి రాజశేఖర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News