ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : క్రీడల ద్వారా మానసిక మానసిక స్థైర్యం తోపాటు సృజనాత్మక శక్తి పొందుతుందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతెలిపారు. శనివార జిల్లా స్థాయి సీఎం కప్–2025-2026 క్రీడాపోటీలు శనివారం ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. జిల్లా స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడాపోటీలను ప్రారంభించినఅనంతరం ఎస్పీ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసాన్ని కూడా పెంపొందిస్తాయని, ప్రతి విద్యార్థి క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయిలో జోగుళాంబ గద్వాల్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి డీవైఎస్ఓ కృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడాపోటీలు నిర్వహించబడ్డాయి. అనంతరం విజేతలకు ఎస్పీ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను, గద్వాల్ పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్, ట్రాఫిక్ ఆర్.ఎస్సై బాలచంద్రుడు, ఎస్‌జిఎఫ్ సెక్రటరీ డాక్టర్ తోట శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు వి. శ్రీనివాసులు, బషీర్ స్టేడియం ఇంచార్జి, భరత్,పార్వతమ్మ, అనూష, సుహాసిని, బీసన్న, సతీష్, నగేష్ బాబు, అమ్రేష్ బాబు, నరసింహారాజు, ఆనంద్, వెంకట్రాములు, దేవేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News